
* వాగులో పడ్డ కారు..!
* కారులో ఐదుగురు ప్రయాణికులు
ఆకేరు న్యూస్, జనగామ : గూగుల్ మ్యాప్ ను నమ్ముకుని కారులో తిరుమల వెళ్తున్న భక్తులు ప్రమాదానికి గురయ్యారు. జనగామ జిల్లాలో ఈ రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. గూగుల్ మ్యాప్ డైరెక్షన్ (Google Map Direction) లో వెళ్తున్న కారు వాగులో పడింది. జనగామ జిల్లా వడ్లకొండ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. నాగపూర్ నుంచి తిరుపతి వెళ్తున్నారు భక్తులు. మార్గమధ్యంలో ప్రమాదానికి గురయ్యారు. కారులో ఐదుగురు ప్రయాణికులు ఉన్నారు. అదృష్టవ శాత్తూ అందరూ ప్రాణాలతో బయటపడ్డారు. పోలీసులు కాపాడారు. ప్రమాదం జరిగిన చోట బ్రిడ్జి నిర్మాణం జరుగుతోంది. అక్కడ ఎలాంటి హెచ్చరికల బోర్డులు పెట్టలేదు. అందువల్లే ప్రమాదం జరిగిందని బాధితులు ఆరోపిస్తున్నారు.
…………………………………………