
* ఆరు రోజుల పాటు మృత్యువుతో పోరాడినా..
* తీవ్ర విషాదంలో తల్లిదండ్రులు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : ఆ బాలుడికి ఎదురుగా కూల్ డ్రింక్ సీసా కనిపిస్తే.. అందులో ఉన్నది కూల్ డ్రింకే అనుకున్నాడు. గుటుక్కున తాగేశాడు. చేదుగా ఘాటుగా ఉండడంతో ఉఫ్ ఊసేలోపే లోపలకు వెళ్లిపోయింది. గొంతు మండి అల్లాడిపోయాడు. కడుపులో మంటతో విలవిలాడిపోయాడు. అప్పుడు తెలిసింది అతడు తాగింది కూల్ డ్రింక్ (Cool Drink) కాదు.. గడ్డిమందు అని. ఆరురోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందినా ఫలితం లేకపోవడంతో ఈరోజు మృతి చెందాడు. పోలీసులు, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. ఖమ్మం జిల్లాకు చెందిన జాడి నవీన్, వరలక్ష్మి దంపతుల రెండో సంతానం వరుణ్ తేజ్ (5) గత జూన్ నెల 29వ తేదీన ఇంట్లో ఆడుకుంటున్నాడు. కూల్ డ్రింక్ అనుకుని సీసాలో ఉన్న గడ్డిమందు తాగాడు. అది గమనించిన వెంటనే తల్లిదండ్రులు చిన్నారిని స్థానిక హాస్పిటల్ కి తీసుకెళ్లగా పరిస్థితి విషమంగా ఉండడంతో ఖమ్మం.. ఆ తర్వాత హైదరాబాద్ నీలోఫర్ (Nilofer) హాస్పిటల్కు తరలించారు. బాలుడు చికిత్స కోసం పలువురు దాతలు ఆర్థిక సహాయం అందించారు. వైద్యులు బాలుడికి బతికించేందుకు ఆరు రోజులుగా కృషి చేస్తున్నారు. అయినా పాపం ఆ బాలుడి ప్రాణం నిలవలేదు. మృత్యువుతో పోరాడి తుదిశ్వాస విడిచాడు.
………………………………………….