
* గత ప్రభుత్వం మహిళా సమాఖ్యలను నిర్లక్ష్యం చేసింది.
* అవకాశం ఉన్న ప్రతీ చోట మహిళలకు ప్రాధాన్యతనిస్తాం
* ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క
ఆకేరు న్యూస్ హైదరాబాద్ : అవకాశం ఉన్న ప్రతీ చోట మహిళలకు భరోసా కల్పించి అండగా ఉంటామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఆర్టీసీలో ని 151 మండల మహిళా సంఘాల గ్రూపులకు 1.05 కోట్ల చెక్కును భట్టి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో బీఆర్ ఎస్ ప్రభుత్వం మహిళా సమాఖ్యలను పట్టించుకోలేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మహిళాభ్యుదయానికి పెద్ద పీట వేసిందన్నారు. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడమే కాకుండా మహిళలను వ్యాపారవేత్తలుగా రాణించడానికి రకరకాలుగా ప్రోత్సహం అందిస్తున్నామనన్నారు. ఐదేళ్లలో మహిళలకు లక్ష కోట్ల రుణాలు ఇవ్వాలనేది లక్ష్యంగా పెట్టుకున్నామని భట్టి తెలిపారు. ఈ నెల 8న అన్ని మండలాల్లో ప్రభుత్వం మహిళలకు అందిస్తున్న సంక్షేమ పథకాలు ఇతర ప్రోత్సాహకాలపై చర్చించాలని అన్నారు. అదే విధంగా అన్ని మండల కేంద్రాల్లో గ్రామాల్లో మహిళా సమాఖ్య సమావేశాలు ఏర్పాటు చేయాలన్నారు.అదే విధంగా ఈ నెల 10 నుంచి 16 వరకు మహిళలకు వడ్డీ లేని రుణాలు అందించాలని యోచిస్తున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు.ఈ కార్యక్రమంలో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మంత్రి సీతక్క పాల్గొన్నారు.
………………………………………..