
* నీటి గుంతలో పడి పడి అక్కా తమ్ముడు మృతి
* ఆదిలాబాద్ జిల్లాలో తీవ్ర విషాదం
ఆకేరు న్యూస్, ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. సైకిలుపై వెళ్తున్న అక్కాతమ్ముడు నీటి గుంత( Water Hole) లో పడి మృతి చెందారు. దీంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తుండడం స్థానికులను కలిచివేస్తోంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. ఆదిలాబాద్ (Adilabad) జిల్లా మావల గ్రామానికి చెందిన స్వామి కొడుకు విధాత ( 9), కూతురు వినూత్న (11) గ్రీన్ సిటీ సమీపం గుండా సైకిల్ వెళ్తున్నారు. ప్రమాదవశాత్తు నీటి గుంతలో పడిపోయారు. స్థానికులు గమనించి వెంటనే బయటకు తీసినా అప్పటికే మృతి చెందారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వారి మృతదేహాలను రిమ్స్ మార్చురీకి తరలించారు. ఇద్దరు బిడ్డలూ మృతి చెందడంతో ఆ కుటుంబం తీవ్ర దుఃఖంలో మునిగిపోయింది. పిల్లల్ని కోల్పోయిన ఆ తల్లిదండ్రులు గుండెలవిసేలా ఏడుస్తుండడం స్థానికులను కలచివేసింది ఈ సంఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
………………………………………………….