
* పురిటినొప్పులు ఎక్కవ కావడంతో పురుడు పోసిన 108 సిబ్బంది
* తల్లీ బిడ్డ క్షేమం
* అనంతరం ఏటూరునాగానం ఆస్పత్రికి తరలింపు
ఆకేరు న్యూస్ ములుగుః పురిటి నొప్పులతో బాధపడుతూ 108 సమాచారం అందించగానే అంబులెన్స్ చేరుకొని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో ప్రసవ పేదన నొప్పులు తీవ్రం కావడంతో అంబులెన్స్ లోనే సిబ్బంది పురుడు పోశారు. ములుగు జిల్లా ఎటూర్ నాగారం మండలం వీరాపురం గ్రామ సమీపంలోని దట్టమైన అడవిలో గొత్తి కోయ గుంపు కు చెందిన సోలం భోజ్జె (26) మొదటి కానుపు పురిటి నొప్పులు రావడంతో 108 కి కాల్ చేసి సమాచారం అందించారు.విషయం తెలుసుకున్న 108 ఏటూరునాగారం సిబ్బంది ఈఎంటి శివలింగంప్రసాద్, పైలట్ కోటి హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని గర్భిణిని రోడ్డు మార్గం వరకు తీసుకురావడానికి చేయూతనిచ్చారు.గర్భిణి ఆరోగ్య పరిస్తితిని పరీశీలించి మెరుగైన వైద్యం కోసం ఏటూరునాగారం సామాజిక ఆసుపత్రికి తరలిస్తున్న సమయంలో ఊరి చివరిలో పురిటి నొప్పులు అధికం అయ్యాయి దీంతో చాక చక్యంగా వ్యవరించిన ఈఎంటి శివలింగంప్రసాద్ సుఖ ప్రసవం చెయ్యగా పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది . అనంతరం తల్లి బిడ్డలకు కావాల్సిన మందులు అందించి,మెరుగైన వైద్యం కోసం ఏటూరునాగారం సామాజిక ఆసుపత్రికి తరలించారు. బాహ్య ప్రపంచానికి దూరంలో ఉన్న గొత్తికోయ కుటుంబానికి భరోసాగా నిలిచి సుఖ ప్రసవం చేసిన అంబులెన్స్ సిబ్బందికి ఆ మహిళ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
………………………………………………..