
ఆకేరు న్యూస్ తాడ్వాయిః ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క సారలమ్మ దేవతల సన్నిధిలో భక్తులు అమ్మగార్ల గద్దెలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. తొలి ఏకాదశి పండుగను పురస్కరించుకొని రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు .ఆదివాసి ఆచార సంప్రదాయాల ప్రకారం దేవతల గద్దె ల పై పసుపు కుంకుమ బంగారం (బెల్లం) సమర్పించి ఈ ఏడాది పాడిపంటలు సమృద్ధిగా పండాలని,పిల్లాపాపలతో ఆయురారోగ్యాలతో ఉండాలంటూ దేవతలను వేడుకున్నారు. అనంతరం జాతర పరిసరాలలో వంటావార్పు చేసుకుని విందు భోజనాలు చేశారు . దీంతో మేడారం పరిసరాలలో భక్తులతో సందడి సందడిగా మారింది.
…………………………………….