
* కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తాం
* వనమహోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి
* 18.03 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యం
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మహిళలకు 60 సీట్లు ఇచ్చే బాధ్యత తనదని సీఎం రేవంత్ రెడ్డి (Revanth reddy) వెల్లడించారు. ఇందిరమ్మ రాజ్యంలో ఆడ బిడ్డలు ఆత్మగౌరవంతో నిలబడేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. రాజేంద్రనగర్‌లోని వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ‘వన మహోత్సవం’ కార్యక్రమాన్ని సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించారు. రుద్రాక్ష మొక్క నాటారు. తెలంగాణకు పచ్చని చీరను కప్పేందుకు మనందరం కృషి చేయాలని సీఎం పిలుపునిచ్చారు. వ్యవసాయ వర్సిటీలో ఆయన మొక్కలు నాటారు. కార్యక్రమంలో మంత్రి కొండా సురేఖ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను సీఎం తిలకించారు. ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా 18.03 కోట్ల మొక్కలు నాటాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ సందర్బంగా రేవంత్ మాట్లాడుతూ త్వరలో అసెంబ్లీ ఎన్నికల్లోనూ (Assembly Elections) మహిళా రిజర్వేషన్ రాబోతోందని, వచ్చే ఎన్నికల్లో మహిళలకు 60 ఎమెల్యే సీట్లు ఇచ్చేబాధ్యత నేను తీసుకుంటానని భరోసా ఇచ్చారు. అయితే లోక్‌సభ, రాష్ట్రాల శాసనసభల్లో 33 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ఉద్దేశించిన ‘నారీశక్తి వందన్ అధినియమ్’బిల్లు గతంలోనే పార్లమెంటులో ఆమోదం పొందింది.
………………………………………………….