
*ఢిల్లీకి చేరుకున్న సీఎం రేవంత్
* యూరియా కొరత కేంద్రం దృష్టికి
* మెట్రో విస్తరణ, ఓఆర్ఆర్ ప్రాజెక్టుపై చర్చలు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (REVANTHREDDY) కాసేటి క్రితమే ఢిల్లీకి చేరుకున్నారు. హైదరాబాద్ రాజేంద్రనగర్లో జరిగిన వన మహోత్సవంలో పాల్గొన్న వెంటనే ఆయన హస్తినకు పయనం అయ్యారు. రెండు రోజుల పాటు రేవంత్ అక్కడే ఉండనున్నారు. తెలంగాణలో యూరియా కొరతపై రైతులు ఆందోళన చేపడుతున్నారు. దీనిపై కేంద్ర పెద్దలతో చర్చించి సాయం కోరనున్నారు. తెలంగాణ(TELANGANA)కు కేటాయించాల్సిన కోటాను వెంటనే విడుదల చేయాలని విజ్ఞప్తి చేయనున్నారు. అలాగే, మెట్రోరైలు ప్రాజెక్టు (METRO RAIL PROJECT) విస్తరణ, ఓఆర్ ఆర్ (ORR) ఉత్తర భాగం, దక్షిణ భాగాల విస్తరణపై కేంద్ర మంత్రులపై చర్చించే అవకాశం ఉంది. దీంతోపాటు కాంగ్రెస్ పెద్దలను కూడా రేవంత్ కలవనున్నారు. ఈ నెల 14న సూర్యాపేట జిల్లా తుంగపర్తి నియోజకవర్గంలో జరగనున్న రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి రాహుల్ గాంధీ(RAHUL GANDHI), ప్రియాంక గాంధీ(PRIYANKA GANDHI)లను ఆహ్వానించనున్నారు. ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటనలపై బీఆర్ ఎస్ పదే పదే విమర్శలు చేస్తున్నప్పటికీ, రేవంత్ పట్టించుకోవడం లేదు. సీఎం అయ్యాక ఢిల్లీకి వెళ్లడం ఇది 47వ సారి కావడం గమనించాల్సిన విషయం.
…………………………………………………….