
* పరకాల పట్టణంలో శ్రీవాణి సంతాప సభ
*ఏకు శ్రీవాణికి నివాళులర్పించిన నేతలు
* సంతాప సభలో పాల్గొన్న డా.ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి
ఆకేరు న్యూస్, పరకాల ః ఇటీవల ఆత్మహత్య చేసుకున్న ఏకు శ్రీవాణిది ప్రభుత్వ హత్యే అంటూ స్వేరో సభ్యలు ఆరోపించారు. పరకాల మండలం మల్లక్కపేట శివారులోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో ఆత్మహత్య చేసుకొని బలవన్మరణం చెందిన ఏకు శ్రీవాణి మరణానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలంటూ నినాదాలు చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లా స్వేరోస్ ఆధ్వర్యంలో పట్టణంలోని స్వర్ణ గార్డెన్స్ లో ఏకు శ్రీవాణి సంస్మరణ సభ నిర్వహించారు. ఈ సభలో బీఆర్ ఎస్ నాయకులు డా, ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్, మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పాల్గొని శ్రీవాణి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అంతకు ముందు పట్టణంలోని బస్టాండ్ కూడలి నుంచి శ్రీవాణి ఇంటి వరకు ర్యాలీగా వెళ్లారు. శ్రీవాణి కుటుంబ సభ్యలను ఓదార్చారు.ఈ కార్యక్రమంలో ఉమ్మడి వరంగల్ జిల్లా స్వేరోస్ నాయకులు,నియోజకవర్గ బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, యూత్ నాయకులు,అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
…………………………………………………….