
బీజేపీ ఎంపీ బండి సంజయ్
* బీఆర్ఎస్ తో కుమ్మక్కయ్యావా..?
* మీడియాపై దాడి చేస్తుంటే ప్రభుత్వం ఏం చేస్తోంది..?
* సల్కం చెరువులో నిర్మించిన అక్బరుద్దీన్ కళాశాలను హైడ్రా
ఎందుకు కూల్చడం లేదు..
*మీడియాపై దాడి చేస్తే ఊర్కునేది లేదు
ఆకేరు న్యూస్ హైదరాబాద్ ః కేంద్ర మంత్రి బండి సంజయ్ మరోసారి నిప్పులు చెరిగారు. హైడ్రా అధికారుల తీరుపై ఆయన మండి పడ్డారు. సల్కం చెరువలో నిర్మించిన అక్బరుద్దీన్ కళాశాలను హైడ్రా ఎందుకు ముట్టుకోవడం లేదని మండి పడ్డారు. సామాన్యులకు ఒక న్యాయం.. అక్బరుద్దీన్ కు ఒక న్యాయమా అని బండి సంజయ్ ప్రశ్నించారు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతిలపై బీఆర్ ఎస్ చేస్తున్న దాడిని బండి ఖండించారు. మీడియా సంస్థలపై దాడి చేయడం తగదన్నారు. కేసీఆర్ కుటుంబసభ్యలపై ఇన్ని రకాలుగా ఆరోపణలు వస్తున్నా సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ప్రభుత్వం కేసీఆర్ కు చుట్టంలా వ్యవహరిస్తోందని ఆరోపించారు.
……………………………………………………………..