
* సంస్థాగత నిర్మాణంపై దృష్టి
* ఉమ్మడి జిల్లాల ఇంచార్జిల నియామకం
ఆకేరున్యూస్, హైదరాబాద్ ః కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణంపై దృష్టి సారించింది.ఇంతకు మందు పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా ఉపాధ్యక్షలు, ప్రధాన కార్యదర్శులను నియమించిన తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఇప్పుడు ఉమ్మడి జిల్లాలకు ఇన్ చార్జిలను నిమమించింది. ఈ మేరకు పార్టీ వ్యవహారాల ఇంచార్జి మీనాక్షి నటరాజ్ టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ఇన్ చార్జిల పేర్లను ప్రకటించారు.జిల్లాల వారీగా హైదరాబాద్ జగ్గారెడ్డి..మెదక్ = పొన్నం ప్రభాకర్ …నల్లగొండ్ -సంపత్ కుమార్..ఖమ్మం-వంశీచంద్ రెడ్డి…వరంగల్-అడ్లూరి లక్ష్మణ్…మహబూబ్నగర్-కుసుమ కుమార్..ఆదిలాబాద్-అనీల్ యాదవ్…కరీంనగర్-అద్దంకి దయాకర్…నిజామాబాద్-అజ్మతుల్లా హుస్సేన్… రంగారెడ్డి-శివసేన రెడ్డి సోమవారం వీరందరితో పార్టీ వ్యవహారాల ఇంచార్జి మీనాక్షి నటరాజన్, టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ లు జూమ్ మీటింగ్ నిర్వహించారు. పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని పటిష్టం చేయాలని ఆదేశించారు. స్థానిక సంస్థల ఎన్నికల కోసం బాగా కష్టపడి పనిచేయాలని ఆదేశించారు.
…………………………………………………….