
* సీతక్క యువసేన జిల్లా అధ్యక్షుడు చెర్ప రవీందర్.
ఆకేరున్యూస్, ములుగు : గత బిఆర్ఎస్ ప్రభుత్వం హయాంలోనే హత్యలు , హత్యాచారాలు ఎక్కువ గా జరిగాయని సీతక్క యువసేన జిల్లా అధ్యక్షుడు చెర్ప రవీందర్ ఆరోపించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రక్క జిల్లా నుండి వచ్చిన బిఆర్ఎస్ నాయకులు ప్రశాంతంగా ఉన్న ములుగు జిల్లా లో అలుజడి సృష్టిస్తున్నారని ఆరోపించారు.ఇది ఇలాగే కొనసాగితే జిల్లా నాయకులు చూస్తూ ఊరుకోరని, కచ్చితంగా తగిన బుద్ది చెప్తామన్నారు. తాడ్వాయి మండలం లో అయితే అందరూ నాయకులు క్లీన్ ఇమేజ్ ఉన్నవాళ్లే ఉన్నారని హత్యాచార నిందితులకు స్థానం లేదన్నారు . సీతక్క యువసేన జిల్లా కమిటీ లో 90% ఉస్మానియా, JNTU యూనివర్సిటీల్లో చదివిన మేధావులు ఉన్నారన్నారు. తమ నాయకురాలు సీతక్కపై గాని ఇతర నాయకులపై గాని అసత్య ఆరోపణలు చేస్తే ఊరుకునే ప్రసక్తి లేదని ప్రజలు అన్నీ గమనిస్తున్నారని అన్నారు.. ఈ జిల్లాలో ఇప్పటికైనా ఆరోపణలు మానుకోవాలని బిఆర్ స్ నాయకులకు హెచ్చరించారు.
…………………………………………………..