
* ఆయన కోసం కుర్చీ కూడా వేసినం
* మంత్రులు వచ్చినా చర్చకు సిద్ధం
* పోనీ మరో రోజు టైం చెప్పండి
* బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
* చెప్పినట్లే సోమాజిగూడ ప్రెస్ క్లబ్ కు రాక
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : రైతు సమస్యలు చర్చిద్దాం రండి అంటే సీఎం రేవంత్ రెడ్డి తోక ముడిచి ఢిల్లీకి తప్పించుకుపోయారని బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (Ktr) తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఈరోజు ఉదయం 11 గంటలకు సోమాజిగూడ ప్రెస్‌క్లబ్ కు రావాలని రేవంత్ కు సవాల్ విసిరిన కేటీఆర్.. చెప్పినట్లుగానే ఆయన అక్కడకు చేరుకున్నారు. సీఎం రేవంత్ కోసం ఓ కుర్చీ కూడా వేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. సవాల్ విసరడం.. బురదజల్లడం.. పారిపోవడం రేవంత్ (Revanth)కు మొదటి నుంచి అలవాటేనని విమర్శించారు. ‘కొడంగల్‌లో ఒడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని సవాల్ చేసి ఆరు నెలలు తిరగకముందే మల్కాజిగిరిలో ఎంపీగా పోటీ చేస్తివి.. హైదరాబాద్ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంట అంటివి.. అందుకే నువ్వు మాట మీద నిలబడే మనిషిని కాదు కాబట్టే నీ కొరిక మేరకు కొడంగల్(Kodangal)లోనైనా, కొండారెడ్డిపల్లిలోనైనా, నీ జూబ్లీహిల్స్ (Jubilihills) ప్యాలెస్లోనైనా..అంబేద్కర్ చౌరస్తాలోనైనా, చివరికి అసెంబ్లీలోనైనా చర్చకు సిద్ధమని చెప్పినం.. కాదుపోదూ అంటే తటస్థ వేదిక అయినా ప్రెస్‌క్లబ్‌కు మేమే వస్తమని చెప్పినం.. జూలై 8న 11 గంటలకు రమ్మని అడిగినం.. నువ్వు తప్పించుకపోతవని తెలుసు.. నీకు బేషజాలు తప్పా బేసిన్ల గురించి తెలియదు రేవంత్ సవాల్‌ను స్వీకరించి మొన్ననే ప్రెస్‌క్లబ్‌ను బుక్ చేసినం.‘ అని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి రాని స్థితిలో మంత్రుల్లో ఎవరొచ్చినా ఓకే అన్నారు. ఒకవేళ ఈ రోజు వీలుకాకుంటే మరోరోజైనా తాము వచ్చేందుకు రెడీగా ఉన్నామని కుండబద్ధలుకొట్టారు.
…………………………………………………….