
* 19 మందికి అస్వస్థత
* ఇప్పటి వరకు ఇద్దరి మృతి?
* నిర్వాహకులను అరెస్ట్ చేశాం : జూపల్లి
* కేపీహెచ్ బీ పీఎస్ లో కేసు నమోదు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : హైదరాబాద్ కూకట్‌పల్లిలో కల్తీ కల్లు (adulterated toddy) కలకలం రేపింది. నిన్న రాత్రి జరిగిన ఈ ఘటనలో 17 మంది బాధితులు అస్వస్థతకు గురయ్యారు. ఇప్పటికీ వేర్వేరు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించి ఇద్దరు మృతి చెందినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై అబ్కారీ అధికారులు వెంటనే స్పందించి మూడు కల్లు దుకాణాలను సీజ్ చేశారు. నిర్వాహకులను అరెస్టు చేసినట్లు మంత్రి జూపల్లి సత్యనారాయణ (Jupalli Satyanarayana)తెలిపారు. నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులు ఆయన కాసేపటి క్రితం పరామర్శించారు. ఇద్దరు గాంధీ ఆస్పత్రిలో, మరో ఇద్దరు ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని వివరించారు. అందరి ఆరోగ్యమూ నిలకడగా ఉందని తెలిపారు. అయితే వైద్యులు మాట్లాడుతూ బాధితులకు ఆదివారం నుంచి మూత్రపిండాల పనితీరు సరిగా లేదని, దీనివల్ల కిడ్నీలపై తీవ్ర ప్రభావం పడి, రక్తంలో క్రియాటినైన్ స్థాయులు ప్రమాదకరంగా పెరిగాయని అంటున్నారు. మరోవైపు, ఈ కల్తీ కల్లు వ్యవహారం వెలుగులోకి రావడంతో అబ్కారీ అధికారులు వేగంగా స్పందించారు. హైదర్‌నగర్(Hyderanagar), ఆల్విన్‌కాలనీ(Alwyncolony), శంషీగూడలోని మూడు కల్లు దుకాణాలను సీజ్ చేశారు. బాధితుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని, మరికొందరు వేర్వేరు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని అధికారులు అనుమానిస్తున్నారు. దీనిపై కేపీహెచ్ బీ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. నిర్వాహకులను అరెస్ట్ చేసినట్లు మంత్రి చెబుతుండగా, పరీరాలో ఉన్నారని పోలీసులు చెబుతున్నారు.
…………………………………………………