
* కొందరిని కాపాడిన సహాయక బృందాలు
* మృతుల సంఖ్య పెరిగే అవకాశం
ఆకేరు న్యూస్, డెస్క్ : వాహనాలు వెళ్తుండగా, అకస్మాత్తుగా బ్రిడ్జి కూలిపోయింది. దీంతో పలు వాహనాలు నదిలో పడిపోయాయి. వాహనాల్లోని ప్రయాణికులు కొట్టుకుపోయారు. వారిలో 10 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. సహాయక బృందాలు కొందరిని కాపాడాయి. ఈ ఘటన గుజరాత్ (Gujarath)లో జరిగింది. అధికారులు, ప్రత్యక్షసాక్షుల కథనం ప్రకారం.. బుధవారం ఉదయం 7:30 గంటల సమయంలో వంతెనపై వాహనాల రద్దీ ఎక్కువగా ఉంది. రెండు పిల్లర్ల మధ్య ఉన్న పెద్ద భాగం ఒక్కసారిగా కూలిపోయింది(Bridge Collapse). కూలిపోవడానికి ముందు పెద్ద శబ్దం వినిపించిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ ప్రమాదంలో రెండు ట్రక్కులు, ఒక పికప్ వ్యాన్, ఒక ఈకో వ్యాన్ సహా నాలుగు వాహనాలు నదిలోకి పడిపోయాయి. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, స్థానికులు కలిసి సహాయక చర్యలు ప్రారంభించారు. జాతీయ విపత్తు స్పందన దళం (NDRF) బృందాలు కూడా సంఘటనా స్థలానికి చేరుకుని సహాయ కార్యక్రమాల్లో పాల్గొన్నాయి. నదిలో పడిన ఐదుగురిని సురక్షితంగా బయటకు తీశారు. నదిలో మునిగిన వాహనాలను బయటకు తీయడానికి క్రేన్లను వినియోగిస్తున్నారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించినట్లు గుజరాత్ ప్రభుత్వం ప్రకటించింది. ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ (Bhupendra Patel) నిపుణులతో సమగ్ర దర్యాప్తు చేయాలని ఆదేశించారు. ఈ వంతెన 43 ఏళ్ల నాటిదని, గత ఏడాదే మరమ్మతులు చేసినట్లు తెలుస్తోంది.
…………………………………….