
*మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
* ఏపీవో కుటుంబాన్ని పరామర్శించిన మాజీమంత్రి
ఆకేరు న్యూస్, జనగామ: ఉపాధి హామీ పథకంలో ఏపీవోగా పనులు చేస్తున్న శ్రీనివాస్ గుండెపోటుతో మృతి చెందడాన్ని సర్కారు హత్యగానే భావించాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్పష్టం చేశారు. జనగామ జిల్లా దేవరుప్పుల మండలంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో APO గా విధులు నిర్వహిస్తున్న కమ్మగాని శ్రీనివాస్ గౌడ్ గత మూడు నెలలుగా జీతాలు రాకపోవడంతో ఆర్థిక ఇబ్బందుల వలన మనస్థాపానికి గురై రెండు రోజుల క్రితం గుండె పోటుతో మరణించారు. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మృతుడి ఇంటికి వెళ్లి సంతాపం తెలిపారు. కుటుంబాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వంపై ఉందని, ఇది ముమ్మాటికి ప్రభుత్వ హత్యేనని అన్నారు. ఎన్నికల వేల ఉద్యోగులకు అనేక హామీలు ఇచ్చి గద్దెనెక్కగానే ఉద్యోగులకు కనీసం వేతనాలు కూడా ఇవ్వకుండా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దివాలా తీసే పాలన ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో కొనసాగుతుందన్నారు. తెలిపారు. రాష్ట్రం లో తుగ్లక్ పాలన కొనసాగుతుందని ఆరోపించారు. ప్రభుత్వం ఈ కుటుంబానికి కోటి రూపాయల నష్టపరిహారం ఇవ్వాలనీ ఆయన అన్నారు. రాష్ట్రంలో రైతుల పరిస్థితి మరీ ఘోరంగా ఉంది ఇప్పటికే నీళ్లు లేక కరెంటు కోతలతో అల్లాడుతున్న రైతులకు ఎరువులు కూడా సక్రమంగా అందడం లేదు. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం స్పందించి రైతులను, ఉద్యోగులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
……………………………………………….