
* స్థానికంపైనే ప్రధాన చర్చ
ఆకేరు న్యూస్ హైదరాబాద్ : సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సెక్రటేరియట్ లో తెలంగాణ మంత్రుల కేబినెట్ సమావేశం ప్రారంభం అయింది. ఈ సమావేశంలో ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికలపైనే చర్చ జరుగనున్నట్లు తెలుస్తోంది. స్థానిక సంస్థలు ఎప్పుడు నిర్వహించాలి స్థానిక సంస్థల్లో ఎంత మేర రిజర్వేషన్లు కేటాయించాలి అలాగే స్థానిక సంస్థల్లో అనుసరించాల్సిన వ్యూహం తదితర అంశాలు ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది. అలాగే మేడిగడ్డ బ్యారేజీ విషయంలో ఎన్డీఎస్ ఏ ,విజిలెన్స్ ఇచ్చిన నివేదికపై చర్చించనున్నట్లు తెలిసింది. మహిళలకు మరిన్ని సంక్షేమ పథకాలు అమలు చేసేందకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది.. ఈ అంశాలపై మంత్రి మండలి సుదీర్ఘంగా చర్చించనుంది.
……………………………………………………