
* జనగామ కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్
* పలు చోట్ల ఆయిల్ పామ్ ప్లాంటేషన్
ఆకేరు న్యూస్, జనగామ: ఆయిల్ ఫామ్ సాగుతో లాభాలు అధికంగా వస్తాయి అని జనగామ కలెక్టర్ షేక్ రిజ్వాన్ భాషా అన్నారు. రైతులు ఆయిల్ ఫామ్ సాగుపట్ల మొగ్గుచూపాలని సూచించారు. లింగాల ఘనపూర్ మండలం నెల్లుట్ల గ్రామ రైతు చిట్ల జ్ఞానేందర్ రెడ్డి కి చెందిన 12.5 ఎకరాలలో జిల్లా కలెక్టర్ రిజ్వన్ భాషా షేక్ చేతుల మీదుగా ఆయిల్ పామ్ ప్లాంటేషన్ జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆయిల్ పామ్ మెగా ప్లాంటేషన్ లో భాగంగా తెలంగాణ ప్రభుత్వం ఆయిల్ పామ్ సాగు విస్తరణ పైన దృష్టి సారించి దేశంలోనే మన రాష్టం మొదటి స్థానం లో ఉండేలా రైతులను ప్రోత్సహిస్తుందని తెలిపారు. దేశానికే సరిపడా పామ్ ఆయిల్ ఉత్పత్తి చేసే సామర్ధ్యం రైతులకు ఉందని గమనించి ఉద్యాన శాఖ ద్వారా మొక్కలతో పాటు పంట సాగుకు అవసర అయ్యే డ్రిప్ ఇరిగేషన్ సిస్టం ని రాయితీ పైన ప్రభుత్వం అందిస్తుందన్నారు. మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటల వైపు రైతులను మళ్లించేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఇందుకోసం అవసరమైన పెట్టుబడి సాయాన్ని రైతులకు అందజేస్తోందన్నారు. మొక్కల అందజేత నుంచి ఎరువులు, డ్రిప్పు పరికరాలు, అంతర పంటల సాగు తదితర వాటికి ప్రభుత్వం ప్రోత్సహకాలు ఇస్తోందని ఎస్సీ, ఎస్టీ రైతులకు వందశాతం, బీసీ రైతులకు 90 శాతం, ఇతర వర్గాల రైతులకు 80 శాతం చొప్పున రాయితీ సదుపాయాలను ప్రభుత్వం కల్పిస్తోందన్నారు. తక్కువ మంది కూలీల వినియోగం, తక్కువ నీటి వాడకం తో వేసే ఆయిల్ పామ్ పంట వల్ల ఎక్కువ రాబడి పొందవచ్చు అన్నారు. ఈ సంవత్సరం 3500 ఎకరాల లక్ష్యం కాగా ఇప్పటివరకు 783 ఎకరాలకు మంజూరు ఇచ్చి మొక్కలను అందచేస్తున్నామన్నారు. ఆయిల్ పామ్ పంట విక్రయించడానికి రైతులు ఇబ్బంది పడకుండా జనగామ జిల్లాల్లో నియోజకవర్గానికి ఒకటి చొప్పున జిల్లాకి 3 కలెక్షన్ సెంటర్లు మంజూరు చేశామన్నారు 40 ఎకరాలలో ఆయిల్ పామ్ మొక్కలకు నర్సరీ ఏర్పాటు చేస్తున్నామన్నారు. అలాగే నూతన ఆయిల్ ఫెడ్ భవనం కి స్థలం కేటాయించడం జరిగిందన్నారు. ఈ రోజు జనగామ జిల్లాలో 18 చోట్ల వంద ఎకరాల లో మెగా ఆయిల్ పామ్ ప్లాంటేషన్ జరిగిందన్నారు. జిల్లాకి చెందిన పాలకుర్తి మండలం ముత్తారం గ్రామానికి చెందిన రైతులు కె.జమున (3.1) ఎకరాలు, ఎమ్. వెంకట రమణ, సబిత దేవి(4) ఎకరాలు, వనపర్తి శేఖర్, ఉమరాణి (2.6), వాల్మిడి గ్రామానికి చెందిన రైతు వీరమల్ల వెంకటేష్(4.3) ఎకరాలు, విస్నూర్ గ్రామానికి చెందిన బానోత్ బిచ్చ (2) ఎకరాలు, జఫర్ గడ్ మండల ఓబుళాపురం గ్రామానికి చెందిన రైతులు జె.శ్రీనివాస్, రాజు(4.35), ఉప్పుగల్ గ్రామానికి చెందిన రైతు గడ్డం శివశంకర్(3) ఎకరాలు, దేవరుప్పుల మండలం చిన్నమాడుర్ గ్రామానికి చెందిన రైతులు కె.లక్ష్మణ్ రావు, అన్నపూర్ణ, హరిక్షిత్(5), కొడకండ్ల మండలం రంగాపురం గ్రామానికి చెందిన రైతు ఎన్. లలిత (5) ఎకరాలు, బచన్నపేట్ మండలం కేసిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన రైతులు ఎమ్.జయమ్మ,ఎమ్.కళావతి(6) ఎకరాలు,పడమటి కేశవాపూర్ గ్రామానికి చెందిన రైతు చిర్ర చంద్రశేఖర్ రెడ్డి(2). ఎకరాలు రఘునాథపల్లీ మండలం గోవర్ధనగిరి గ్రామానికి చెందిన రైతులు అజ్మీరా నందిని (4), భూక్యా నాగు (0.5) ,శ్రీమన్నారాయణ పురం గ్రామానికి చెందిన రైతు ఎన్ శోభ రాణి (10.5) లింగాల ఘనపూర్ మండలం చెందిన కుందరం గ్రామానికి చెందిన రైతు వి.జయలక్ష్మి (4.5), జనగామ మండలం వడ్లకొండ గ్రామానికి చెందిన రైతు ఎ. ప్రభాకర్ రెడ్డి (12.5) ఎకరాలలో మెగా ఆయిల్ పామ్ ప్లాంటేషన్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమం లో జిల్లా ఉద్యన శాఖ అధికారి శ్రీధర్ రావు, జిల్లా వ్యవసాయ అధికారి రామారావు నాయక్, జిల్లా ఆయిల్ ఫెడ్ మేనేజర్ శంకర్, ఆయిల్ ఫెడ్ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.
………………………………………………………..