
* కల్తీ కల్లు మరణాలపై కేటీఆర్ సీరియస్
* ప్రభుత్వమే బాధ్యత వహించాలి..
* బాధితులకు 20 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలని డిమాండ్
ఆకేరు న్యూస్ హైదరాబాద్ : హైదరాబాద్ లో కల్తీ కల్లు తాగి ఆరుగురు మరణించడం పై బీ ఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తీవ్రంగా స్పందించారు. కల్తీ కల్లు మరణాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం తక్షణమే 20 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులకు మెరుగైన చికిత్స అందించాలన్నారు. ఇంత మంది చనిపోతే ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తోందన్నారు. ఎక్సైజ్ అధికారుల తీరుపై ఆయన మండిపడ్డారు. భవిష్యత్ లో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు.
……………………………………