
* కత్తితో పొడిచి చంపేసిన విద్యార్థులు
* హరియాణాలో దారుణం
ఆకేరు న్యూస్ , డెస్క్: తల వెంట్రుకలు బాగా పెరిగాయి హెయిర్ కట్ చేసుకోవాలని మందలించిన ఉపాధ్యాయుడిని విద్యార్థులు దారుణంగా కత్తులతో పొడిచి హత్య చేశారు. దుస్తులు శుభ్రంగా ఉంచుకోవాలి. తల వెంట్రుకలు పెంచుకోకుండా నీట్ గా కటింగ్ చేసుకోవాలని ఈ మద్యనే విద్యార్థులకు నోటీసులు ఇవ్వడంతో పాటు కుటుంబ పెద్దలను పిలిపించి కౌన్సిలింగ్ నిర్వహించినట్లు సమాచారం. విద్యార్థులకు క్రమ శిక్షణ ఈ ఘటన హరియాణాలోని హిస్సార్ జిల్లా , బాద్సా పూర్ గ్రామం లోని కర్తార్ మెమోరియల్ సీనియర్ సెకండరీ ప్రైవేట్ పాఠశాలలో ఈ ఘటన జరిగింది. ఇంతకు మించి ప్రత్యేకమైన కారణాలు ఏమైనా ఉన్నాయా అన్న కోణంలో విచారణ చేస్తున్నామని ఎస్పీ అమిత్ యశ్వర్థన్ చెప్పారు. తీవ్ర గాయాలతో ప్రిన్సిపల్ జగ్బీర్ సింగ్ ( 50 ) మృతి చెందారు. నిందితులైన ఇద్దరు విద్యార్థుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.
——————————————