
* బిసి సేల్ నాయకుడు ములుగు జిల్లా యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు పెండెం శ్రీకాంత్
ఆకేరున్యూస్, ములుగు: క్యాబినెట్ సమావేశంలో బీసీ రిజర్వేషన్ల అమలుకు అవసరమైన ఆర్డినెన్స్ తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం చారిత్రాత్మక ఘట్టం అని బిసి సేల్ నాయకుడు ములుగు జిల్లా యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు పెండెం శ్రీకాంత్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2018 చట్టాన్ని సవరించి బీసీలకు న్యాయం చేసే దిశగా ప్రజా ప్రభుత్వం కృషి చెస్తుందని అన్నారు. ఏఐసీసీ అగ్రనేత శ్రీ రాహుల్‌గాంధీ భారత్ జోడో యాత్రలో చేసిన అంశం జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు పెంచాలి అనే డిమాండ్‌లో భాగంగా దేశంలో తొలిసారిగా తెలంగాణ రాష్ట్రంలోనే అమలు చేస్తున్నందుకు గర్వంగా ఉందన్నారు. ఈ చారిత్రాత్మక నిర్ణయాన్ని అమలు పరచేందుకు కృషి చేసిన ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి శ్రీ భట్టి విక్రమార్క ,టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ , పంచాయతీ రాజ్ శాఖ మంత్రీ వర్యులు దనసరి అనసూయ సీతక్క , బీసీ శాఖ మంత్రి వర్యులు పొన్నం ప్రభాకర్ తో పాటు మంత్రివర్గ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. తెలంగాణలో బీసీ సామాజిక వర్గానికి, సామజిక న్యాయం కోసం పోరాడుతున్న కాంగ్రెస్ పార్టీకి అండగా నిలవాలని కోరారు.
……………………………………………………