
* ఇద్దరు యువకులపై హత్యా యత్నం
ఆకేరు న్యూస్ వరంగల్ ః నగరంలోని రంగశాయిపేట ప్రాంతంలో గంజాయి మత్తుకు అలవాటు పడిన యువకులు రెచ్చిపోయారు. గంజాయి మత్తులో ఏం చేస్తున్నామనే విచక్షణ కోల్పోయి ప్రవర్తించారు. అర్దరాత్రి వేళ వీరంగం సృష్టించి ఇద్దరు యువకులపై హత్యా యత్నం చేశారు. అదే ప్రాంతానికి చెందిన కేడల నరేష్,బజ్జురి వంశీలపై దాడిచేసి హత్యా యత్నం చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన యువకులు మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. చికిత్స పొందుతున్న ఇద్దరు యువకుల్లో కేడల నరేష్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది.
……………………………………..