
ఆకేరు న్యూస్, ములుగు: తాడ్వాయి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బొల్లు దేవేందర్ ముదిరాజు ఆద్వర్యంలో మేడారం సమ్మక్క సారలమ్మ అమ్మవార్లను రాష్ట్ర మంత్రి సీతక్క, నూతన ములుగు మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కళ్యాణి దర్శించుకున్నారు. మొదట ఎండోమెంట్ అధికారులు , పూజారులు , కాంగ్రెస్ పార్టీ నాయకులు , సాంప్రదాయ పద్ధతిలో డోలు వాయిద్యాలతో ఘన స్వాగతం తెలిపారు.ఆదివాసి సంస్కృతి సంప్రదాయాల ప్రకారం దేవతల గద్దెల పై పసుపు కుంకుమ బంగారం (బెల్లం) సమర్పించి ప్రత్యేకమైన పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు , మండల నాయకులు , అనుబంధ సంఘాల నాయకులు , అధికారులు సమ్మక్క సారలమ్మ దేవతల పూజారులు తదితరులు పాల్గొన్నారు.
…………………………………………