
* విలక్షణ నటుడు కోటా శ్రీనివాసరావు కన్నుమూత
* 750కు పైగా చిత్రాల్లో నటన
* సినీ ప్రయాణంలో ఎన్నో విలక్షణ పాత్రలను పోషించిన కోటా
ఆకేరున్యూస్, హైదరాబాద్: ప్రముఖ నటుడు, సీనియర్ యాక్టర్ కోటా శ్రీనివాసరావు (83) ఆదివారం తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. గత కొన్నిరోజులుగా తీవ్ర అస్వస్థత తో భాధపడుతున్న ఆయన ఫిల్మ్ నగర్లోని తన స్వగృహంలోనే మరణించారు. వయసు మీద పడటంతో నడవలేని స్థితిలో ఉన్నా రెండేళ్ళ క్రితం వరకూ సినిమాల్లో నటించారు. గత నాలుగు దశాబ్దాల సినీ ప్రయాణంలో ఎన్నో విలక్షణ పాత్రలను పోషించారు కోటా శ్రీనివాసరావు. 750కు పైగా చిత్రాల్లో నటించారు. కోట మృతిలో చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. అయన మృతిపై సినీ పరిశ్రమలోని సినీ ప్రముఖులతో పాటు రాజకీయ నేతలు కూడా సంతాపం వ్యక్తం చేస్తున్నారు. కోట శ్రీనివాసరావు జననం 1942 జూలై 10 న జన్మించారు.ఆయన నిమా నటుడు. అతను తమిళం, హిందీ, కన్నడ, మలయాళంలో కూడా కొన్ని చిత్రాలలో నటించాడు. మాజీ రాజకీయవేత్తగా, శ్రీనివాసరావు 1999 నుండి 2004 వరకు భారతదేశంలోని ఆంధ్ర ప్రదేశ్లోని విజయవాడ తూర్పు నుండి ఎమ్మెల్యేగా పనిచేశారు. సీనియర్ నటుడు కోటా శ్రీనివాసరావు చాన్నాళ్లుగా సినిమాలకు దూరంగా ఉన్నారు. వయసు మీద పడటంతో నడవలేని స్థితిలో ఉన్నా కూడా రెండేళ్ల ముందు వరకు పలు చిత్రాల్లో నటించారు. చివరగా 2023లో వచ్చిన ‘సువర్ణ సుందరి’ మూవీలో కనిపించారు.
…………………………………