
* డీజిల్ లోడ్ తో వెళ్తున్న గూడ్స్ రైలుకు మంటలు
* రైలు పట్టాలు తప్పడంతో చెలరేగిన మంటలు
* తాత్కాలికంగా నిలిచిపోయిన రైళ్ల రాకపోకలు
ఆకేరున్యూస్ డెస్క్ ః తమిళనాడులోని తిరువల్లూరు సమీపంలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. చెన్నైలోని ఎన్నోర్ నుంచి డీజిల్ లోడ్ తో ముంబాయి బయలు దేరిన రైలు ఆదివారం ఉదయం ఐదుగంటలకు తిరువల్లూరు సమీపంలోని ఎగట్టూరు వద్దకు రాగానే పట్టాలు తప్పింది. పట్టాలు తప్పిన వెంటనే రైలు బోగీల్లోంచి పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి.దీంతో చైన్నై నుంచి అరక్కోనం రూట్ లో రైళ్ల రాకపోకలను నిలిపివేశారు. వెంటనే ఘటనా స్థలికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పుతున్నారు. ముందుజాగ్రత్త చర్యగా ఆ ప్రాంతం అంతా కరెంట్ సరఫరాను నిలిపివేశారు. సమీపంలో ఉన్న ఇళ్లలో గ్యాస్ సిలిండర్లను కూడా బంద్ చేయించారు. గాలిలో మంటలు రేగి ఈ ప్రాంతమంతా దట్టమైన పొగలు వ్యాపించాయి. శ్వాస తీసుకోవడానికి కూడా ఇబ్బంది కలుగుతోంది. శ్వాసకోస సంబందమైన వ్యాధులు ఉన్న వారు ఇళ్లనుంచి బయటకు రాకూడదని అధికారులు సూచించారు.
………………………………………………………