
* దళిత రత్న అవార్డు గ్రహీత నెమలి నర్సయ్యమాదిగ
ఆకేరు న్యూస్, ములుగు: కండరాల క్షిణత, రక్తహీనత వ్యాధిగ్రస్తులకు ఆసరా పెన్షన్ ఇవ్వాలని ఎం ఆర్ పి ఎస్ నాయకుడు, దళిత రత్న అవార్డు గ్రహీత నెమలి నర్సయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ములుగు జిల్లా వెంకటాపూర్ (రామప్ప) మండలం నల్లకుంట గ్రామంలోని వెలిసోజు ప్రేమ్ సాగర్ గత నాలుగు నెలలుగా రక్తహీనత కండరాల క్షీణత తో బాధపడుతూ మంచానికే పరిమితం బాధాకరమని నర్సయ్య మాదిగ ఆవెదన వ్యక్తం చేశారు. ఆ కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చారు. నల్లకుంట గ్రామంలో అత్యంత పేదరికంలో కడు వడ్రంగి కుటుంబంలో జన్మించిన ప్రేమ్ సాగర్ కుటుంబాన్ని అన్ని రాజకీయ పార్టీల మేధావులు సందర్శించి ఆర్థికంగా సహకరించాలని కోరారు. ప్రభుత్వం ఆ కుటుంబానికి ముఖ్యమంత్రి సహాయ నిధి తో పాటు, ప్రతి నెల పెన్షన్ అందించే విధంగా ఆ కుటుంబానికి అండగా ఉండాలని డిమాండ్ చేశారు.
వచ్చే నెల ఆగస్టు మాసంలో జరగబోవు రక్తహీనత కండరాల క్షిణత,వ్యాధిగస్థులకు పెన్షన్, వికలాంగులకు పెన్షన్ హెచ్చింపు పై జరగబోవు దివ్యాంగుల గర్జన సభకు అన్ని వర్గాల పేదలు పాల్గొనాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్, మహాజన సోషలిస్ట్ పార్టీ ములుగు జిల్లా ఉపాధ్యక్షులు కడపాక శ్యామ్ మాదిగ, తెలంగాణ రాష్ట్ర గౌడ సంఘం ములుగు జిల్లా అధ్యక్షులు మునిగాల రాజు గౌడ్, విశ్వకర్మ (వడ్రంగి) హక్కుల పోరాట నాయకులు వెలిశోజు శ్రీరామ్, రమణాచారి, నమిండ్ల కుమారస్వామి వడ్రంగి హక్కుల పోరాట మహిళ విభాగ నాయకురాలు లతక్క మరియు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
……………………………………………