
– జనగామకలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్
ఆకేరు న్యూస్, జనగామ: పర్యావరణ పరిరక్షణ బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని జనగామ కలెక్టర్ షేక్ రిజ్వాన్ భాషా అన్నారు. స్రీ, శిశు సంక్షేమ శాఖ తరపున చేపట్టిన వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ పసరమడ్ల అంగనవాడి కేంద్రాల్లో మొక్కలు నాటే కార్య్రమాన్ని ప్రారంభించారు. వనమహోత్సవం కార్యక్రమాల్లో భాగంగా స్రీ, శిశు, సంక్షేమ శాఖకు 500 మొక్కలు నాటాలన్న లక్ష్యం కి అనుగుణంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిధిగా హాజరై మొక్కను నాటారు. కాలుష్య రహితం గా మారుతున్న పర్యావరణాన్ని కాపాడుకునే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని.. ఈ సందర్బంగా కలెక్టర్ తెలిపారు. అన్ని అంగన్వాడి కేంద్రాల్లో పండ్ల, ఔషధ మొక్కలను నాటడం ద్వారా అంగన్వాడి కేంద్రంలకు వచ్చే పిల్లల న్యూట్రిషన్ స్థాయిని కూడా మార్పు చేయవచ్చన్నారు. అనంతరం కేంద్రంలో ఉన్న గర్భిణీలు, బాలింతలను అంగన్వాడీ సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. కేంద్రంలో ఉన్న గ్రుడ్లు, పప్పు నిల్వల నాణ్యతను పరిశీలించారు. ప్రీస్కూల్ పాఠ్యాంశాలు ఏ విధంగా బోధిస్తున్నారని పిల్లలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో స్రీ , శిశు సంక్షేమ అధికారిని ఫ్లోరెన్స్, సీడీపీఓ సత్యవతి , సూపర్వైజర్, అంగన్వాడి టీచర్లు, గ్రామ సిబ్బంది పాల్గొన్నారు.
………………………………………………….