
* మహిళా రోగిపై వార్డుబాయ్ అత్యాచారయత్నం
* చితకబాదిన బాధితురాలి కుటుంబసభ్యులు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో దారుణం చోటుచేసుకుంది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మహిళా రోగిపై వార్డు బాయ్ అత్యాచార యత్నం చేశాడు. బాధితులు, పోలీసుల కథనం ప్రకారం.. హైదరాబాద్ విద్యానగర్ (Vidyanagar ) లోని ఆంధ్ర మహిళా సభ ఆసుపత్రిలో (andhra mahila sabha hospital ) ఓ మహిళ చికిత్స కోసం చేరింది. బెడ్‌పై నిద్రిస్తున్న ఆమెపై ఓ వార్డ్ బాయ్ అత్యాచారయత్నానికి (sexual Harassment) పాల్పడ్డాడు. ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో బాధితురాలు కేకలు వేసింది. ఆమె అరుపులతో సిబ్బంది అప్రమత్తమయ్యారు. అక్కడే ఉన్న బాధితురాలి కుటుంబ సభ్యులు వార్డ్ బాయ్ ని చితకబాదారు. అనంతరం నల్లకుంట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
……………………………………..