
ఆకేరు న్యూస్ అమరావతి ః తెలుగుదేశం సీనియర్ సభ్యుడు అశోక్ గజపతిరాజు గోవా గవర్నర్ గా నియమితు లయ్యారు. ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అశోక్ గజపతి రాజును గోవా గవర్నర్గా నియమిస్తూ ఉత్తర్వులుజారీ చేశారు. తెలుగుదేశంలో సీనియర్ సభ్యుడైన అశోక్ గజపతిరాజు 1978లో జనతా పార్టీలో రాజకీయ జీవితం ప్రారంభించిన అశోక్ గజపతి రాజు 1982 లో తెలుగుదేశం ఆవిర్భావంతో తెలుగుదేశంలో చేరారు. 1983, 1985, 1989, 1994.1999,2009 లో ఎమ్మెల్యేగా విజయనగరంకు ప్రాతినిధ్యం వహించారు.2014 లో విజయనగరం నుండి లోక్ సభకు ఎన్నికయ్యారు.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పలు దఫాలు మంత్రిగా వ్యవహరించిన అశోక్ గజపతి రాజు కేంద్రంలో పౌరవిమాన యాన శాశ మంత్రిగా పనిచేశారు. పరిపాలనా అనుభవం ఉన్న అశోక గజపతి రాజును గోవా గవర్నర్ గా నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఈ సందర్భంగా అశోక గజపతి రాజుకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలిపారు.
…………………………………….