* గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై మాధవీలత సంచలనకామెంట్స్
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : మహిళలను, ఇతర మతస్తులను దూషించడమే నీ హిందూత్వవాదమా అని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌ను బీజేపీ నాయకురాలు మాధవీలత (MADAVI LATHA) ప్రశ్నించారు. పార్టీలో ఎవరూ సహకరించలేదన్న నువ్వు.. నాకు సహకరించావా అన్నారు. పార్టీ సహకరించకుండానే నువ్వు మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచావా అని ప్రశ్నించారు. ఎంపీ అభ్యర్థిగా మగాళ్లు ఎవరూ దొరకలేదా.. అని నన్ను హేళన చేశారన్నారు. కార్పొరేటర్ ను తీసుకొచ్చి ఎమ్మెల్యేను చేస్తే పార్టీని తిట్టడం సబబేనా అన్నారు. గోషామహల్ లో రాజాసింగ్ (RJASINGH) కంటే తనకే ఎక్కువ ఓట్లు వచ్చాయన్నారు. గోషామహల్, జూబ్లీహిల్స్ లలో పార్టీ ఎక్కడ పోటీ చేయమంటే, అక్కడ చేస్తానన్నారు. పార్టీ ఏం చెబితే అది చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు మాధవీలత తెలిపారు. ఇటీవలే రాజాసింగ్ బీజేపీకి రాజీనామా చేశారు. ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేశారు. పార్టీ ఆయన రాజీనామాను ఆమోదించింది. ఎమ్మెల్యే పదవికి రాజీనామా కూడా ఆమోదం పొందేలా యత్నిస్తోంది. ఆ స్థానం నుంచి బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా మాధవీలత పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది.
……………………………………..
