ఆకేరు న్యూస్, జనగామ: పాలకుర్తి రిజర్వాయర్ అసంపూర్తి పనులను వెంటనే ప్రారంభించి పూర్తి చేసి దేవాదుల నీటితో చెరువులు కుంటలు నింపాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి రాపర్తి సోమయ్య అన్నారు. మంగళవారం పాలకుర్తి నియోజకవర్గ కేంద్రంలో అసంపూర్తిగా ఉన్న పాలకుర్తి రిజర్వాయర్ ను సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాలకుర్తి రిజర్వాయర్ పనులు పూర్తి కాకపోవడం వల్లనే రైతాంగం తీవ్రంగా నష్టపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. రిజర్వాయర్ పేరుతో పాలకుర్తి చెరువు కట్టను తొలగించడంతో 400 ఎకరాల్లో రైతులు పంటలను సాగు చేసుకోవడం లేదని, రైతులు ఆర్థికంగా నష్టపోయారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం రిజర్వాయర్ పనులను వెంటనే పూర్తి చేసి సుమారుగా 7500 ఎకరాలకు సాగునీరు అందించాలని వారు కోరారు. రాష్ట్రవ్యాప్తంగా ఈసారి ముందస్తు వానలు అధిక వర్షపాతం నమోదు అవుతుందని వాతావరణ శాఖ సూచనలతో రైతాంగం రోహిణి మూర్ఖశిర కార్తిలోనే పెద్ద ఎత్తున పత్తి విత్తనాలు నాటగ వర్షాలు కురువక అవి మొలకెత్తక ఒక్కో రైతు రూపాయలు ఐదువేల నుంచి పదివేల వరకు నష్టపోయారు అన్నారు. తర్వాత కురిసిన వర్షాలతో మరోసారి నాటిన విత్తనాలు మొలకెత్తిన ప్రస్తుత వర్షాభావ కారణంగా ఎండిపోతున్నాయని, నాట్లు వేసేందుకు పోసుకున్న నారుమడులు ఎండిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు, భూగర్భ జలాలు అడుగంటి బోర్లు ఎండిపోతుండడంతో ప్రభుత్వం వెంటనే చెరువుల్లోకి దేవాదుల నీటిని వదిలి రైతులను ఆదుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి చిట్యాల సోమన్న, ఏవో ఐ రాష్ట్ర నాయకులు సోమా అశోక్ బాబు, మాసంపల్లి నాగయ్య, రైతు సంఘం మండల కన్వీనర్ బెల్లి సంపత్, బచ్చు శ్రీలత, బెల్లి వెంకన్న, మల్పరాజు నరేష్, ఈర్ల శ్రీను, కొంతం అంజన్న, యాకన్న తదితరులు పాల్గొన్నారు.
………………………………
