ఆకేరు న్యూస్, చత్తీస్గఢ్ : దండకారణ్యంలో మళ్లీ తుపాకీ చప్పుళ్లు మార్మోగాయి. ఇటీవల చత్తీస్గఢ్ లో జరిగిన భారీ ఎన్కౌంటర్లో 29 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. మరోసారి చత్తీస్గఢ్ లోనే ఎన్కౌంటర్ జరిగింది. సుకుమా జిల్లా సలాతోంగ్ అటవీప్రాంతంలో మావోయిస్టులు, పోలీసుల మధ్య కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఓ మావోయిస్టు మృతి చెందగా, కొంత మంది జవాన్లకు గాయాలు అయినట్లు తెలిసింది. ఘటనాస్థలంలో భారీగా పేలుడు పదార్థాలు, ఇతర సామగ్రిని భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయి. కాగా, మావోయిస్టుల కోసం భద్రతా దళాలు సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తూనే ఉన్నాయి. ఎన్కౌంటర్ పై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
—————–
Related Stories
December 27, 2024