* ప్రేమపేరుతో పైశాచికత్వం
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : ప్రేమ పేరుతో ఓ యువకుడు పైశాచికత్వానికి పాల్పడ్డాడు. ప్రేమను అంగీకరించలేదని ఓ బాలికను బంధించి మూడు రోజుల పాటు అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతటితో ఆగకుండా మరో దారుణానికి ఒడిగట్టాడు. ఉత్తరప్రదేశ్ Uthar pradesh ) లోని లఖింపూర్ఖేరీ ( Lakhimpuri Kheri ) జిల్లాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. లఖింపూర్ఖేరీ జిల్లా కేంద్రంలో స్థానికంగా ఉంటున్న అమన్ (22) అనే యువకుడు పెళ్లి చేసుకుంటానని ఓ బాలిక వెంట పడ్డాడు. ఆమె తిరస్కరించడంతో కక్ష పెంచుకున్నాడు. ఆమెను బంధించి మూడు రోజుల పాటు.. అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతటితో ఆగకుండా కాల్చిన ఇనుప రాడ్డుతో బాలిక ముఖంపై తన పేరు రాశాడు. చివరికి అతనిబారినుంచి తప్పించుకున్న బాలిక అపస్మారక స్థితిలో ఉండగా గమనించిన స్థానికులు ఆస్పత్రిలో చేర్పించారు. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో నిందితుడిని అదుపులోకి తీసుకొని పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. కాగా, నిందితుడు ప్రస్తుతం హైదరాబాద్ లోని ఓ సెలూన్ షాప్లో పనిచేస్తున్నట్లు సమాచారం.
————–
Please tell us what is wrong. Your report will be sent to the website team.
