
* సోషల్ మీడియాలొ అసభ్య పోస్టులు
*డబ్బుసంపాదనే ధ్యేయం
* పోలీసులకు ఫిర్యాదు చేసిన స్థానికులు
* యువతులను అదుపులోకి తీసుకున్న పోలీసులు
* ఐటీ చట్టం ప్రకారం కేసు నమోదు ః ఎస్పీ కృష్ణ బిష్ణోయ్
ఆకేరు న్యూస్ డెస్క్ ః సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు చేస్తూ డబ్బు సంపాదిస్తున్న యువతులను ఎట్టకేలకు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉత్తర ప్రదేశ్ లోని సంభల్ జిల్లా అస్మొలీ ప్రాంతానికి చెందిన ఇద్దరు మహక్, పరి అనే ఇద్దరు యువతులు మరో ఇద్దరితో కలిసి సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రాంలో అశ్లీల పోస్టులు పెడ్తూ డబ్బులు సంపాదిస్తున్నారు. సోషల్ మీడియాలో మహక్ పరిచ 143 అనే ఇన్స్టాగ్రం అకౌంట్ ద్వారా ఈ నలుగురు యువతు లు డబ్బు సంపాదన కోసం పూర్తిగా విశృంఖలత్వంతో ఆశ్లీల అసభ్య పోస్టులు పెడుతూ నైతిక విలువలకు సామాజిక కట్టు బాట్లకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారు. వీరి ఆగడాలను వీరి ఆశ్లీలతను చూసి విసిగిపోయిన స్థానికులు వీరిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఈ నలుగురు యువతులను అదుపులోకి .తీసుకున్నారు. వీరిపై ఐటి చట్టం ప్రకారం కేసులు నమోదు చేయనున్నట్లు జిల్లా ఎస్పీ కృష్ణ బిష్ణోయ్ మీడియాకు వెల్లడించారు.
……………………………………….