* బెయిలుకూ నిరాకరణ
ఆకేరు న్యూస్, డెస్క్ : గోల్డ్ స్మగ్లింగ్ కేసులో కన్నడ నటి రన్యారావు(RanyaRao)కు ఊహించని దెబ్బ తగిలింది. బెంగళూరు కోర్టు ఆమెకు ఏడాది పాటు జైలు శిక్ష విధించింది. బెయిల్ కోసం దరఖాస్తు చేసుకునే హక్కును నిరాకరించింది. దీంతో ఆమె ఏడాది పాటు జైలు నుంచి విడుదలయ్యే అవకాశం కూడా లేదు. మార్చి 1న బెంగళూరు విమానాశ్రయంలో భారీగా బంగారం స్మగ్లింగ్ (Gold Smugling) చేస్తూ ఆమె పట్టుబడ్డారు. ఈ కేసులో తరుణ్ కొండూరు, సాహిల్ జైన్ కూడా అరెస్టు అయ్యారు. ఏకంగా 15 కేజీలతో డీఆర్ఐ అధికారులకు ఆమె పట్టుబడ్డారు. దుబాయ్ వెళ్లి రావడంతో అధికారులు నిఘా పెట్టారు. మార్చి నెలలో దుబాయ్ (Dubai) నుంచి బెంగళూరు రాగానే ఆమెను అరెస్ట్ చేశారు. రాన్య వద్ద 15 కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకుని, ఆమెను అరెస్ట్ చేవారు. గోల్డ్ బిస్కట్లను దుస్తుల్లో దాచి తీసుకొచ్చారని అధికారులు వెల్లడించారు. మాజీ డీజీపీ రామచంద్రరావు కుమార్తెను అని ఆమె అప్పుడు చెప్పుకున్నట్లు పోలీసులు తెలిపారు.
…………………………………………
Please tell us what is wrong. Your report will be sent to the website team.
