* సైబరాబాద్ లో అందుబాటులోకి కొత్త వెబ్సైట్
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ కొత్త అధికారిక వెబ్సైట్ cyberabadpolice.gov.in ను బుధవారం ప్రారంభించింది. ఈ వెబ్సైట్ ను నేషనల్ ఇన్ఫర్మేమేటిక్స్ సెంటర్ (NIC) ఈ వెబ్ సైట్ను అభివృద్ధి చేసింది. పారదర్శకతను పెంచేందుకు, ప్రజలకు వెబ్ సైట్ కేంద్రంగా సేవలను అందించేందుకు దీన్ని రూపొందించినట్లు సైబరాబాద్ (Cyberabad) పోలీసులు వెల్లడించారు. ఈ వెబ్ సైట్ ద్వారా పౌరులు ముఖ్యసేవలను సులభంగా పొందగలుగుతారు. సమస్యలపై ఆన్లైన్లోనే ఫిర్యాదు చేసే అవకాశం ఉంది. పోలీసు సేవలను పారదర్శకంగా అందించేందుకు సర్కారు పలు మార్పులు చేస్తోంది. ఈక్రమంలోనే అధిక సంఖ్యలో పోలీసుల బదిలీలను చేపట్టింది. అలాగే, ఇప్పుడు పౌరులు ఫిర్యాదు చేసే విధానాన్ని సరళీకృతం చేసే ప్రయత్నాలు చేస్తోంది.
…………………………………………………….
Please tell us what is wrong. Your report will be sent to the website team.
