* వారిపై సీఐడీకి ఫిర్యాదు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : హెచ్‌సీఏలో టికెట్ల డిమాండ్ల కేసు కొత్త మలుపు తిరుగుతోంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్(KTR), ఎమ్మెల్సీ కవిత(KAVITHA)పై తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ (TCA) ఫిర్యాదు చేసింది. హెచ్ సీఏలో అక్రమార్కుల వెనుక కేటీఆర్, కవిత హస్తం ఉందని ఆరోపించింది. వీరితో పాటు జాన్ మనోజ్, వియానంద్, పురుషోత్తం అగర్వాల్, సురేంద్ అగర్వాల్ పైనా ఫిర్యాదు చేసింది. జగన్మోహనరావు ఎన్నిక వెనుక వారి హస్తం ఉందని ఫిర్యాదులో పేర్కొంది. ఎన్నికల్లో గెలిచాక కేటీఆర్, కవిత, హరీశ్‌రావుకు విజయం అంకిత చేయడమే ఇందుకు నిదర్శనంగా తెలిపింది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్మోహన్ రావును సీఐడీ ఇటీవలే అరెస్టు చేసింది. ఐపీఎల్ మ్యాచ్‌ల సందర్భంగా అదనంగా మరో 10శాతం టికెట్లు ఫ్రీగా ఇవ్వాలని ఎస్ ఆర్ హెచ్ యాజమాన్యాన్ని బెదిరించినట్లు ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారంలో విజిలెన్స్ రిపోర్టు ఆధారంగా ఆయనతో పాటు పాలకవర్గం సభ్యులను సీఐడీ (CID) అదుపులోకి తీసుకుంది. కాగా, టికెట్ల కోసం జగన్మోహన్రావు (JAGANMOHANRAO) ఎస్ఆర్హెచ్ (SRH) ఫ్రాంచైజీపై ఒత్తిడి తెచ్చినట్లు విజిలెన్స్ కూడా నిర్ధారించింది. 10 శాతం టికెట్లను ఉచితంగా ఇస్తున్నా, మరో 10శాతం టికెట్లను ఉచితంగా ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు వెల్లడించింది.
……………………………………………………
Please tell us what is wrong. Your report will be sent to the website team.
