* పోక్సో కేసు నమోదు
ఆకేరు న్యూస్, జనగామ: కంటికి పాపను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన కన్న తండ్రి కూతురును కాటేసిన కర్కశత్వం ఇది. సభ్య సమాజం తలించుకునేలా చేసిన జరిగిన ఈ దురదృష్టకర సంఘటన జనగామ జిల్లా దేవరుప్పుల మండలంలోని కోలుకొండ గ్రామం లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే తండ్రి వల్లపు నారాయణ తన మైనర్ కూతురును లైంగికంగా వేధించాడు. ఈ విషయం ఆ బాలిక తల్లికి చెప్పినప్పటికీ ఆమె స్పందించలేదు. మరోసారి వేధించడంతో బాలిక తన పెద్దమ్మకు జరిగిన విషయం తెలిపింది. దీంతో ఆమె సహకారంతో బాలిక స్థానిక పోలీస్టేషన్ లో ఫిర్యాదు చేసింది. బాలిక తండ్రిపై పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు దేవరుప్పుల మండల ఎస్సై ఊర సృజన్ కుమార్ తెలిపారు. ఆ బాలికను బాలల సంరక్షణ అధికారులకు అప్పగించినట్లు ఎస్సై తెలిపారు.
……………………………….
Please tell us what is wrong. Your report will be sent to the website team.
