– జిల్లా కలెక్టర్ షేక్ రిజ్వాన్ భాషా
ఆకేరు న్యూస్, జనగామ: మహిళలు ఆర్థిక శక్తిగా ఎదిగినప్పుడే కుటుంబంతో పాటు దేశ ఆర్థిక శక్తి మెరుగుపడుతుందని జిల్లా కలెక్టర్ షేక్ రిజ్వాన్ భాషా అన్నారు. గురువారం జనగామ జిల్లా కేంద్రంలో, పాలకుర్తి భాషారత్ గార్డెన్ లో ఇందిరా మహిళా శక్తి సంబరాలు నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ మాట్లాడుతూ మహిళలు స్వయం శక్తితో ఆర్థిక అభివృద్ధిని సాధించాలని సూచించారు. మహిళలు వ్యాపార రంగాల్లో రాణించాలని అన్నారు. ప్రస్తుత పరిస్థితిలో మహిళలు వ్యాపార రంగాల్లో చురుకుగా, ఒక ప్రణాళిక బద్దంగా దుసుకపోతున్నారని అన్నారు. ప్రభుత్వం మహిళలు అన్నీ రంగాల్లో రాణించాలని ఆర్దికంగా ప్రోత్సహిస్తుందని వివరించారు.
మహిళలు మహారాణులు
మహిళలు మహారాణులుగా వెలుగొందాలని ఎమ్మెల్యే, అసెంబ్లీ అంచనాల కమిటీ మెంబర్ మామిడాల యశశ్విని రెడ్డి అన్నారు. మహిళలం మనం ఎందులో తక్కువ కాదని అన్నారు. అన్ని రంగాల్లో మనం ముందు వరుసలో ఉండాలని సూచించారు. మహిళలకు రాబోవు ఎన్నికల్లో సింహ బాగం సీట్లు కేటాయించేందుకు సిఎం రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో మహిళలకు వడ్డీలేని రుణాలను అందజేశారు. ఇందిర మహిళా శక్తి సంబరాలను పురస్కరించుకుని కేక్ కట్ చేసి కలెక్టర్, ఎమ్మెల్యే కు తినిపించి సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పింకేశ్ కుమార్, చాకలి ఐలమ్మ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు పులిపంపుల మమత, డీ ఆర్ డి ఏ వసంత, నూరోద్దీన్, ఆర్ టీ ఏ జిల్లా మెంబర్ అభి గౌడ్, పాలకుర్తి మార్కెట్ చైర్ పర్సన్ లావుడ్య మంజుల తదితరులు పాల్గొన్నారు.

……………………………………..
