
* రైతులకు మంత్రి సీతక్క సూచన
* రైతుకు చెక్కు అందజేసిన మంత్రి
ఆకేరు న్యూస్, ములుగు:ములుగు జిల్లాలో పామాయిల్ పంట సాగులో అధిక దిగుబడి సాధించాలని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి స్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనుసరి అనసూయ సీతక్క అన్నారు. ములుగు జిల్లాలోని గోవిందరావుపేట మండలంలో ఐదు సంవత్సరాల క్రితం పామాయిల్ పంట సాగు చేసి దిగుబడి సాధించిన పామ్ ఆయిల్ పంటను ప్రభుత్వ అధికారులు కొనుగోలు చేశారు .టన్ను ధర17వేల రూపాయలు మార్కెట్ ప్రకారం నిర్ణయించారు. దీనికి సంబంధించిన చెక్కును రైతు కుమార్ స్వామికి మంత్రి సీతక్క అందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ ప్రాంతంలోని ప్రతి రైతు పామాయిల్ పంట సాగుకు చొరవ చూపాలని కోరారు. దీనితో పాటు ప్రకృతిని కాపాడాలని సూచించారు. ఈ పంట సాగు చేసినట్లయితే ప్రకృతిని సైతం కాపాడినట్లు అవుతుందని అభిప్రాయపడ్డారు. జంగాలపల్లి లో ఈ పామ్ ఆయిల్ ఫ్యాక్టరీ ఏర్పాటు అవుతున్నదని తెలిపారు .రైతులు పండించిన పంటను మన జిల్లాలోని విక్రయించడానికినికి అవకాశం ఉందని వివరించారు. ఈ పంటను రైతులు ఎక్కువ సంఖ్యలో సాగు చేసి దిగుబడి సాధించి అభివృద్ధి చెందాలని సూచించారు .రైతులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈకార్యక్రమంలో కలెక్టర్ దివాకర జెసి, వ్యవసాయ మార్కెట్ చైర్మన్ రేగ కళ్యాణి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవిచందర్, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్, వివిధ శాఖల జిల్లా మండల స్థాయి ఉన్నతాధికారులు రైతులు తదితరులు పాల్గొన్నారు.
……………………………….