
ఆకేరు న్యూస్, శ్రీశైలం ః శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆలయంలో జులై 25 నుంచి ఆగస్టు 24 వరకు శ్రావణ మాసోత్సవాలు నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. శ్రావణ మాసం సందర్భంగా ఆలయంలో భక్తుల రద్దీ విపరీతంగా పెరిగే అవకాశం ఉంటుందని ఆలయ అధికారులు 16 రోజుల పాటు సామూహిక అభిషేకాలు, గర్భాలయ అభిషేకాలు నిలిపివేస్తున్నట్లు తెలిపారు. ఆగస్టు 15 నుంచి 18 వరకు స్పర్శ దర్శనాన్ని కూడా నిలిపివేస్తున్నట్లు తెలిపారు.ముఖ్యంగా శని,ఆది,సోమ వారాల్లో అభిషేకాలను నిలిపివేస్తున్నట్లు తెలిపారు.రెండు తెలుగు రాష్ల్రాల నుంచి భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.
……………………………………………