* శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి
* సభలోని వాటిపైనే స్పందిస్తా
* కవిత, తీన్మార్ మల్లన్నలొల్లిపై గుత్తా పరోక్ష వ్యాఖ్యలు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ ః శాసనమండలి చైర్మన్ గా సభ లోపల జరిగే కార్యకలాపాలపై చర్య తీసుకునే అధికారం మాత్రమే తనకు ఉంటుందని బయటి గొడవలతో తనకు సంబందం లేదని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇటీవల ఎమ్మెల్సీ తీన్నార్ మల్లన్న కార్యాలయం పై జాగృతి కార్యకర్తలు దాడిచేసిన విషయం తెల్సిందే. ఈ నేపధ్యంలో అటు ఎమ్మెల్సీ కవిత ఇటు తీన్మార్ మల్లన్నలు పరస్పర ఆరోపణలు చేసుకున్నారు. ఒకరిపై ఒకరు క్రమశిక్షణా చర్యలు తీసుకోవల్సిందిగా శాసనమండలి చైర్మన్ కు ఫిర్యాదులు చేశారు. ఈ నేపధ్యంలో చైర్మన్ వ్యక్తి గత గొడవలతో తనకు సంబందం లేదని సభలోపల జరిగే విషయాలపైనే తనకు అధికారం ఉంటుందని వ్యాఖ్యానించారు. సభ లోపల అయినా సభ బయట అయినా సభ్యులు హుందాగా ప్రవర్తిస్తే బాగుంటుందని సూచించారు. పెద్దల సభ మర్యాదను కాపాడాల్సిన బాధ్యత సభ్యులపై ఉందన్నారు.సభ్యులు హుందాగా ప్రవర్తించి భావితరాలకు ఆదర్శంగా నిలవాలని సూచించారు.
…………………………………..
