
* ఇకపై వరుసగా వానలు కురుస్తాయి
* వాతావరణ శాఖ తాజా అప్డేట్
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : సరిపడా స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో అన్నదాత ఆందోళన చెందుతున్నాడు. వరినాట్లు ఎండిపోయే ప్రమాదం ఉందని కలత చెందుతున్నాడు. ఈసీజన్లో ఇప్పటి వరకు సరైన వర్షాలు లేవు. దీంతో రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో వాతావరణ శాఖ కాస్త ఊరటనిచ్చే వార్త ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్(Andhrapradesh), తెలంగాణ (Telangana)రాష్ట్రాల్లోఇక నుంచి రోజూ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. తెలంగాణలోని పలు జిల్లాల్లో సోమవారం, మంగళవారం, బుధవారం తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు చాలాచోట్ల కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ (Hyderabad) వాతావరణ కేంద్రం పేర్కొంది. సోమవారం రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులు, ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. మంగళవారం, బుధవారం రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులు, ఈదురు గాలులతో కూడిన భారీ నుండి అతి భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. అన్ని జిల్లాల్లో గంటకు 30 నుంచి 40 కి మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. అలాగే.. ఏపీలోని ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా మూడు నాలుగు రోజుల పాటు ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు చాలాచోట్ల కురిసే అవకాశముంది. భారీ నుండి అతి భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తాజా అప్డేట్ తెలియజేస్తోంది.
……………………………………….