
* ఆస్పత్రిలో చేరిన 11 మంది విద్యార్థులు
ఆకేరు న్యూస్, సంగారెడ్డి జిల్లా : సంగారెడ్డి జిల్లాలోని ప్రభుత్వ మోడల్ పాఠశాల(Model School)లో 11 మంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్ కు లోనయ్యారు. నాగల్ గిద్ద మండలం మొర్గి గ్రామంలోని పాఠశాలలో రాత్రి డిన్నర్ లో 60 మంది విద్యార్థులు చికెన్ తిన్నారు. ఉదయానికి చాలా మంది వాంతులు, విరోచనాలతో ఇబ్బందులు పడ్డారు. ఫుడ్ పాయిజన్ అయి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. ఈ విద్యార్థులు అందరూ నారాయణఖేడ్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారి ఆరోగ్యం బాగానే ఉందని, అబ్జర్వేషన్ లో ఉంచామని వైద్యులు తెలిపారు.
……………………………….