
* సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు
* ప్రజ్ఞాపూర్ లో బీఆర్ ఎస్ ముఖ్యనేతలతో సమావేశం
ఆకేరున్యూస్,సిద్దిపేటః రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురవేస్తామని సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ధీమా వ్యక్తం చేశారు. గజ్వేల్ నియోజకవర్గ ముఖ్యనేతలతో ఆయన ప్రజ్ఞాపూర్ లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో ఉన్న మొత్తం 31 జిల్లా పరిషత్ లలో బీఆర్ ఎస్ పార్టీ 18 స్థానాలు కైవసం చేసుకుంటుంది అని అన్నారు. రేవంత్ పాలనలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని హరీష్ ఆరోపించారు. బీఆర్ ఎస్ హయాంలో ఇచ్చిన రైతు బంధును ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాళేశ్వరం జలాలను మల్లన్న సాగర్ లోకి ఎందుకు వదలడం లేదని హరీష్ ప్రశ్నించారు. రాష్ట్రంలో కరెంట్ కోతలు ఎక్కువయ్యాయని కరెంట్ కోతలతో రైతులు,చిన్న చిన్న వ్యాపారస్తులు సామాన్య మానవులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. రేవంత్ పాలనలో భూముల ధరలు పడిపోయాయని విమర్శించారు. భూములను కొనడానికి ఎవరూ ముందుకు రావడం లేదని అన్నారు. రియల్ ఎస్టేట్ పూర్తిగా పడిపోయిందని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపుకోసం అహర్నిషలు కృషి చేయాలని ఆయన కార్యకర్తలకు పిలిపునిచ్చారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ యాదవరెడ్డి, మాజీ ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
……………………………………