
* కొండాయి బ్రిడ్జిని సందర్శించిన కాంగ్రెస్ నాయకులు
ఆకేరు న్యూస్, ములుగు: ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం లోని కొండాయి, మల్యాల, గ్రామాలకు బ్రిడ్జి నిర్మాణ పనులు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆకస్మికంగా సందర్శించారు.
ఈ సందర్భంగా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఇర్సవడ్ల వెంకన్న, మండల అధ్యక్షులు చిటమట రఘు మాట్లాడుతూ… ఏటూరునాగారం మండల కేంద్రంలోని కొండాయి బ్రిడ్జి గురువారం సందర్శించామని ఈ బ్రిడ్జి నిర్మాణానికి గతంలో మంత్రి సీతక్క 11 కోట్లు మంజూరు చేశారని తెలిపారు . ఆ నిదులు సరిపోవు అని ఎస్టిమేషన్ వేసిన అధికారులు తెలపడంతో మంత్రి సీతక్క 16 కోట్లను కేటాయించారని తెలిపారు. ప్రస్తుతం పనులు వేగవంతంగా జరుగుతున్నాయని, వాతావరణ మార్పు వలన కొన్ని రోజుల వరకు పనులు నిలుస్తాయన్నారు. బిఆర్ఎస్ పార్టీ నాయకులు నిత్యం అసత్య ప్రచారాలు చేస్తూ మంత్రి పై బురద జల్లాలని చూస్తున్నారని ఆరోపిం చారు. ఈ కార్యక్రమంలోజిల్లా అధికార ప్రతినిధి ముక్కెర లాలయ్య, బ్లాక్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి వావిలాల నరసింహ రావు, మండల ప్రధాన కార్యదర్శి వావిలాల ఎల్లయ్య, మాజీ సర్పంచ్ చేల వినయ్,మండల సహాయ కార్యదర్శి ఉమ్మనేని రమేష్, పిఎసిఎస్ డైరెక్టర్ వంగపండ్ల రవి,కుక్కల రాములు, కొండాయి మహేష్,తిప్పనపల్లి రవీందర్, కోకిల రాజు, సుదర్శన్,పరికి ప్రసాద్,అనిల్, ఆలం నాగార్జున్, కమలక్క,స్థానిక కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
………………………………………..