ఆకేరు న్యూస్ , భువనగిరి : యాదాద్రి భువనగిరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
ప్రమాదంలో ఏపీకి చెందిన ఇద్దరు డీఎస్పీలు చక్రధర్‌రావు, శాంతారావు మరణించారు.
యాదాద్రి భువనగిరి పరిధి చౌటుప్పల్ మండలం కౌతాపురం సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఏపీకి చెందిన డీఎస్పీలు చక్రధర్‌రావు, శాంతారావు, అడిషనల్ ఎస్పీ ప్రసాద్ తదితరులు విజయవాడ నుంచి హైదరాబాద్‌కు వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో డీఎస్పీలు చక్రధర్‌రావు, శాంతారావు అక్కడికక్కడే మృతి చెందారు. డ్రైవర్ నర్సింగ్‌రావు పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.చనిపోయిన డీఎస్పీలు ఇంటెలిజెన్స్ అండ్ సెక్యూరిటీ వింగ్‌లో పనిచేస్తున్నట్టు తెలుస్తోంది. పోలీసుల వాహనం డివైడర్‌ను ఢీకొట్టి అవతలి వైపునకు వెళ్లింది. ఈ క్రమంలో విజయవాడ వైపు వెళ్తున్న లారీని ఢీకొట్టినట్లు తెలుస్తోంది. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
……………………………………..
Please tell us what is wrong. Your report will be sent to the website team.
