* ఇన్చార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్
* త్రిముఖ పోటీ ఖాయం
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : జూబ్లీ హిల్స్ టికెట్ స్థానికులకు ఇవ్వనున్నట్లు జిల్లా ఇన్ చార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ తేల్చి చెప్పారు. బీఆర్ ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందడంతో జూబ్లీహిల్స్లో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ నేపధ్యంలో జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానాన్ని తిరిగి నిలుపుకోవాలని బీఆర్ ఎస్ ప్రయత్నిస్తుండగా కాంగ్రెస్ బీజేపీలు కూడా జూబ్లీహిల్స్పై కన్నేశాయి. 2023లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినా హైదరాబాద్ పరిధిలో ఒక్కసీటు కూడా దక్కించుకోలేక పోయింది. ఒక రకంగా చెప్పాలంటే హైదరాబాద్ ఫలితాలను కాంగ్రెస్ పార్టీ జీర్ణించుకోలేక పోయింది. కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో బీఆర్ ఎస్ స్థానాన్ని కాంగ్రెస్ గెలుచుకోవడం ఆ పార్టీకి కాస్త ఉపశమనం కటిగించింది. కంటోన్మెంట్ లాగే జూబ్లీహిల్స్ స్థానాన్ని కూడా కైవసం చేసుకోవాలని కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తోంది. అధికారంలో ఉండడం ఆ పార్టీకి కలిసొచ్చే అంశం. కాగా బీఆర్ ఎస్ దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ భార్యకు టికెట్ ఇవ్వాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. మరో వైపు బీజేపీ కూడా జూబ్లీహిల్స్పై దృష్టి సారించింది. ఈ నేపధ్యంలో జూబ్లీ ఎన్నిక రసవత్తరంగా మారనుంది. ఈ జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే టికెట్ కోసం కాంగ్రెస్ పార్టీలో ఫిరోజ్ ఖాన్, అజహరుద్దీన్, నవీన్ యాదవ్, గద్దర్ కూతురు వెన్నెల విశ్వప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. కానీ అధిష్టానం ఏం ఆలోచిస్తుందో వేచి చూడాలి
……………………………………..
