
* విజిలెన్స్, మానిటరింగ్ కమిటీ సమావేశంలో జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్
ఆకేరు న్యూస్, ములుగు: ములుగు జిల్లా వ్యాప్తంగాఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో బాధితులకు న్యాయం అందించాలని జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. పేర్కొన్నారు. బుదవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో కలెక్టర్ ఎస్సీ, ఎస్టి అట్రాసిటీ కేసుల నమోదు, పురోగతి, బాధితులకు చెల్లించాల్సిన పరిహారం తదితర అంశాలపై జిల్లాస్థాయి విజిలెన్స్, మానిటరింగ్ కమిటీ సమావేశం అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు సంపత్ రావుతో కలిసి నిర్వహించారు.
షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నమోదైన అట్రాసిటీ కేసులు, పరిష్కరించిన కేసులు, బాధితులకు అందిన పరిహారం గురించి కలెక్టర్ అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో కేసు పూర్వాపరాలను పరిశీలించి బాధితులకు త్వరితగతిన న్యాయం జరిగే విధంగా అధికారులు చర్య తీసుకోవాలని అన్నారు. ఎస్సీ ఎస్టీ హాస్టళ్లను సందర్శిస్తున్నామని, హాస్టల్లో అన్ని రకాల మౌలిక వసతులు కల్పిస్తున్నామని తెలిపారు. ఎస్సీ కార్పొరేషన్ పరిధిలో బోర్ల మంజూరు అసలైన లబ్ధిదారులకు అందించామని అన్నారు. మానిటరింగ్ కమిటీ సభ్యులు పలు సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. జిల్లా కేంద్రం లో అంబేద్కర్ కమ్యూనిటీ భవన నిర్మించాలని సభ్యులు కోరారు. ఇందిరమ్మ ఇండ్లలో ప్రాధాన్యత ఇవ్వాలని సభ్యులు కోరారు. జిల్లాలో మాదక ద్రవ్యాలు నియంత్రణ చర్యలు చేపట్టాలని కోరారు, సమాజ నిర్మాతలైన యువత డ్రగ్ మహమ్మారి భారిన పడకుండా కాపాడవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, డ్రగ్స్ నిర్మూలనకై అన్ని శాఖలకు చెందిన అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు. డ్రగ్స్ సరఫరా చేసే పాత నేరస్తులపై గట్టి నిఘా ఉంచాలని కలెక్టర్ అన్నారు. ఈ సమావేశంలో ఆర్డీఓ వెంకటేష్, ఎస్సీ వెల్ఫేర్ ఆఫీసర్ లక్ష్మణ్ నాయక్, మున్సిపల్ కమిషనర్ సంపత్, డీఎస్పీ కిషోర్ కుమార్,ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు జొన్న రవి, సునర్కని రాంబాబు, మురకుంట్ల నరేందర్, చింత కృష్ణ, బానోతు రాము నాయక్, తహసీల్దార్లు, జిల్లా అధికారులు, ఎంపి డి ఓ లు, తదితరులు పాల్గొన్నారు.
……………………………………..