
*నిరుపేదలకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం
*జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్
ఆకేరు న్యూస్, ములుగు: అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని ములుగు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ భానోత్ రవిచందర్ అన్నారు. ములుగు పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చింతనిప్పుల భిక్షపతి ఆధ్వర్యంలో ఎస్సీ కాలనీలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు భూమి పూజ చేసి నిర్మాణాలను భానోత్ రవిచందర్ గారు ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ప్రజా ప్రభుత్వంలో నిరుపేదలకు అండగా కాంగ్రెస్ పార్టీ ఉంటుందని ,పేద దళిత వర్గాలకు పెద్ద పీట వేస్తూ ప్రతి సంక్షేమ పథకాలు అమలు చేస్తూ, ప్రజాదరణ పొందుతూ ముందుకు సాగుతున్న మని తెలిపారు.ములుగు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని అన్నారు.ఈ నియోజకవర్గం లో ప్రత్యేక శ్రద్ధ పెట్టి పెద్ద మొత్తలో ఇందిరమ్మ ఇళ్లు మంజూరు అయ్యే విధంగా మంత్రి సీతక్క కృషి చేస్తున్నారని తెలిపారు.ఇందిరమ్మ గృహాలు మంజూరు అయిన వారు తొందరగా ఇళ్లు పూర్తి చేయాలని మన నియోజకవర్గానికి ఇంకా పెద్ద మొత్తంలో ఇందిరమ్మ ఇళ్లు రావాలంటే తొందరగా ఇళ్లను పూర్తి చేసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ములుగు మండల పార్టీ అధ్యక్షుడు ఎండీ చాంద్ పాషా జిల్లా నాయకులు ,యూత్ నాయకులు,జిల్లా ఎస్సీ సెల్ నాయకులు,మైనారిటీ నాయకులు,అనుబంధ సంఘాల నాయకులు,మహిళ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
……………………………………………..